Saturday, April 18, 2026
HomeUncategorizedప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం-మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

ప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం-మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

  • ప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో నేటితరం భవిష్యత్తు శూన్యం
  • సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

 

విశాఖపట్నం జయ జయహే: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే నేటి తరాల భవిష్యత్తు శూన్యం అవుతుందనీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద 29వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందేళ్ళ చరిత్రను తిరగరాసింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలో పర్మిషన్ తీసుకువచ్చి, 8700 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తే అధికారంలో కూర్చున్న చంద్రబాబు ప్రభుత్వం జగనన్న పై కక్షపూరితంగానే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ నేటి తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ప్రైవేటీకరణ పై జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేకతతోనే ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వాసుపల్లి తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాలయాపన చేస్తూ జగనన్న చేసిన మంచి పథకాలు, పనులను కూడా అటకెక్కించారని మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments