తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం శ్రీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బొంతల సాయి బాబా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఎన్టీఆర్ చిత్రా పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ అధికార ప్రతిపక్ష బాధ్యత వహించి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం జరిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య మాట్లాడుతూ
క్రిమినల్స్ ని, తుగ్లక్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వ్యతిరేకిస్తూ 2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు చేయని ప్రయత్నం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టినప్పటికీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల కార్యకర్తలు నాయకులు నిబద్ధతతో చెక్కుచెదరకుండా పార్టీకి మద్దతు తెలియజేసి ఒక్క కార్యకర్త కూడా చెక్కుచెదరలేదని ఎన్టీఆర్ పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం పట్ల తమ విధేయతను తెలియజేసిన తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త జీవితాంతం పార్టీకి విధేయులుగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కస్టర్ మహంకాళి నరసింహారావు, కస్టర్ ఇన్చార్జి మల్లంపూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య కస్టర్ కో ఇన్చార్జి వంగర కొండలు యూనిట్ ఇన్చార్జి కస్తూరి సైదులు ఇన్చార్జి షేక్ రఫీ 51 డివిజన్ సెక్రెటరీ రాజు 39వ బూత్ ఇన్చార్జి కోటపాటి ప్రభాకర్ 20వ బూతు ఇన్చార్జి గండికోట బాబు 40 బూతు ఇన్చార్జి మాధవరావు బోంతల శంకర్ సోషల్ మీడియా వెంకట్, చామంతి బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డిపాటి బాబు ముద్దుల సాంబయ్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బహుజనుల కోసం పుట్టిన పార్టీ టీడీపీ
RELATED ARTICLES
