జంగారెడ్డిగూడెం, జయ జయహే
పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోస్థానిక తాండ్ర పాపారాయుడు సెంటర్లో దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సందర్భంగా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ సిక్కోలు సింహం, తెలుగు వాడి గొంతును ఢిల్లీలో బలంగా వినిపించిన ప్రజానేత అని కొనియాడారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా తెలుగు జాతికి వన్నె తెచ్చిన నాయకుడు వెలమ జాతి పటిష్టతకు ఎనలేని కృషి చేసినమహా నేత అని అభివర్నించారు.
వెలమ టైగర్ లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా యర్రం నాయుడుగుర్తింపు పొందార న్నారు. వెలమ సంఘీయులు వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం సభ్యులు, తాండ్ర పాపారాయుడు యూత్ సభ్యులు వెలమ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
