Tuesday, May 5, 2026
HomeNewsరోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి

రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి

ట్రాఫిక్ ఎస్ఐ ఎల్ ఎస్ ఎన్ దొర
జాతీయ భద్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా అగనంపూడి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలోజరిగిన ఉత్సవాల్లో అగనంపూడి సిగ్నల్ వద్ద వేగాన్ని తగ్గించండి హెలిమేట్స్ వాడండి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి అని ప్లే కట్స్ ద్వారా నినాదాలు చేసారు . అనంతరం దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ ఎల్ ఎస్ ఎన్ దొర మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో వాహనాలు చాలా పెరిగి నిబంధనలో పాటించక పోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నవి భారీ వాహనాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం , టూ వీలర్స్ డ్రైవింగ్ చేసిన వారితో పాటు వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ వాడాలని లేనిచో ఫైన్ కట్టవలసి వస్తుందని అన్నారు.
ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు అతి స్పీడ్ మీద వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. సిగ్నల్ సెంటర్లో ఫ్రీ లెఫ్ట్ బోర్డులు పెట్టించాలని అగనంపూడి సెంటర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని కోరారు.
అగనంపూడి లైన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా ఈశ్వరరావు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులు కడిమి హనుమంతరావు, అంగుళూరి ఈశ్వరరావు, గురు గోవిందరావు, ఐ రాంగోపాల్ శనవాడ సీనియర్ సిటిజన్స్ రాజు, జి బోసు బాబు, రఫీ, సాయన సన్యాసిరావు శ్రేయ ఫౌండేషన్ హెచ్ ఆర్ మేనేజర్ కెపి వరప్రసాద్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments