Tuesday, May 5, 2026
HomeNewsశ్రీరాముడు భారతీయుల ఊపిరి

శ్రీరాముడు భారతీయుల ఊపిరి

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి,

శ్రీరాముడు భారతీయుల ఊపిరని, అనునిత్యం సర్వకాల సర్వావస్థలయందును శ్రీరాముడి స్మరణ లేకుండా జీవించలేరని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ మండలం, విజయనగరం గ్రామంలోని శ్రీ రామాలయం నందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. మొదటిరోజు ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భవనం వేణుగోపాల్ రెడ్డి, టి.శ్రీనివాస రెడ్డి, బి.సుబ్బారెడ్డి, ఎ. సుబ్బారెడ్డి, బి.వి.సుబ్బారెడ్డి, బి. శ్రీనివాసులు రెడ్డి, హార్మోనిష్ఠు నాగేంద్రమ్మ, భజన మండలి సభ్యులు రాజేశ్వరి, కృష్ణవేణి, కల్పన, శిరీష, ఈశ్వరమ్మ, వెంకటరత్నమ్మ, బి. కోటేశ్వరమ్మ, అనంతలక్ష్మి, శ్రావణి, మస్తానమ్మ, పుల్లమ్మ, ప్రసన్న, వెంకాయమ్మ, నవభారతి, బి. సరోజినీ, బజరంగదళ్ ప్రఖండ సంయోజక్ దాసరి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments