Saturday, April 18, 2026
HomeUncategorizedకాశీబుగ్గ ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది - ప్రణవ్ గోపాల్

కాశీబుగ్గ ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది – ప్రణవ్ గోపాల్

కాశీబుగ్గ ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది

వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం,జయ జయహే న్యూస్:

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేతల వ్యాఖ్యలు దురదృష్టకరమని వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తీవ్రంగా విమర్శించారు. శవ రాజకీయాలకు వైసీపీ చిరునామాగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.ఆలయం ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తోందని, ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర,రాష్ట్ర మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు ఇచ్చారని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత,అచ్చెన్నాయుడు తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారని వివరించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే వైసీపీ ప్రయత్నం దురదృష్టకరమని ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments