Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపీఎం ఉషా–జీఐఈఐ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ప్రారంభం

పీఎం ఉషా–జీఐఈఐ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ప్రారంభం

ప్రధానమంత్రి ఉషా –జీఐఈఐ పథకం లో భాగంగా 15 రోజుల టైలరింగ్ మరియు బొటిక్ సర్టిఫికెట్ కోర్సును గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మరిపాలెం లో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సుధ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. సుధ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్య శిక్షణ ఎంతో అవసరమని, టైలరింగ్ వంటి వృత్తి నైపుణ్యాలు విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా ఏవి. సూర్య కుమారి (మాస్టర్ ట్రైనర్ & ఫ్యాషన్ డిజైనర్) హాజరై, టైలరింగ్ ప్రాముఖ్యతను వివరించారు. కుట్టు యంత్రం నిర్వహణ, వస్త్రాల కటింగ్ వంటి ప్రాథమిక అంశాలను విద్యార్థులకు ప్రాయోగికంగా బోధించారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని సీఎంఎస్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పాడేరు (ఏఎస్‌ఆర్ జిల్లా) ప్రిన్సిపాల్ మరియు చైర్‌పర్సన్ డా. వి. చిట్టి అబ్బాయి పర్యవేక్షణలో కార్యక్రమం సాగింది. ఈ శిక్షణకు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా డా. పుష్ప ధనుంజయ్ , సబ్ కోఆర్డినేటర్‌గా కుమారి భువనేశ్వరి దేవి వ్యవహరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments