Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఇప్పడేం.. ఏం చెప్తారు..?

ఇప్పడేం.. ఏం చెప్తారు..?

గీతం భూ దోపిడీపై సమాధానమేదీ

సీఎం చంద్రబాబు స్పందించాలి

నీతులు చెప్పే పవన్ ఏంమంటారో

కూటమి పక్షాలు కూడా ఆలోచించాలి

సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా.. తేల్చి చెప్పండి

శాసన మండలి విపక్ష నేత బొత్స డిమాండ్

విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ…54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యాసంస్థలకు ఈ భూమని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ వైయస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్, మేయర్ లకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే… రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు

విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది. దీనికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. అందులో బాగంగానే ఇవాళ విశాఖ జీవీఎంసీ మేయర్, కమిషనర్, ప్రిన్సిపల్ సెట్రకరీకి వినతిపత్రం సమర్పించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న భూదోపిడీని ఆపాలని విజ్ఞప్తి చేశాం. గీతం విద్యాసంస్థల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని.. వారికి రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనను ఈ నెల 30 వ తేదీన జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ అజెండాలో పెట్టొద్దని కోరాం. నగరంలో మేధావులు సైతం ఈ భూదోపిడీని వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉంటూ… నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఇలా భూదోపిడీకి పాల్పడ్డం దుర్మార్గం. అందుకే ఇవాళ అధికారులకు వినతి పత్రం సమర్పించి.. భూదోపిడీని ఆపాలని కోరాం. రేపు వైయస్సార్సీపీ నేతలంతా గీతం సంస్థల కబ్జాలో ఉన్న 54 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలిస్తాం. మరలా 30 వ తేదీన జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ భూమి రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటే తప్ప… పోరాటం ఆగదు. మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తాం అని బొత్స స్పష్టం చేసారు.

అధికార పార్టీ ఎంపీ భూ కబ్జాపై కూటమి భాగస్వామ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన తమ పార్టీల వైఖరేంటో చెప్పాలి. ఈ దోపిడీని సమర్ధిస్తున్నారా? లేదా దీన్ని తప్పని వ్యతిరేకిస్తారా? తమ వైఖరేంటో స్పష్టం చేయాలి. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అంటే విశాఖలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు దోచుకోవడంలో స్పీడా? మీకు చేతనైతే విశాఖను అభివృద్ధి చేసి చూపించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ నీతి ప్రవచనాలు చెపుతుంటారు. రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని దోచుకోవడం నీతివంతమైన పాలనా? ఇది థర్మమా? సమాధానం చెప్పాలి. వైయస్సార్సీపీ ఈ భూ దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐదేళ్ల పాలనలో వైయస్సార్సీపీ ఎప్పుడూ ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడలేదని వివరించారు.

ఓ సెంటో, ఓ పది గజాలో పేదల ఆక్రమణలో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం పరిపాటి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి బంధువులు, స్థానిక ఎంపీ అయి ఉండి ఏకంగా 54 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమనడం, ప్రభుత్వం దానికి సిగ్గు లేకుండా ఆమోదించడం ధర్మమా? ఇంత భారీ దోపిడీయా? విజ్ఞులైన విశాఖ ప్రజలు, మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సీఎం చంద్రబాబు కుటుంబం విశాఖను పూర్తిగా కబ్జా చేయడం ఖాయం. వారికున్న ధనదాహం రాష్ట్రంలో ఎవరికీ లేదు.. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా వామపక్ష పార్టీలతో మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఎలా భేషజాలు లేవు.
భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీ నాయకులు, జీవీఎంసీ కౌన్సిల్ లో ఉన్న ఆ పార్టీ సభ్యులతో మాట్లాడుతాం. మీరు ఈ భూకబ్జాను సమర్ధిస్తున్నారా? లేదా అని ప్రశ్నిస్తున్నాం. వాళ్లు కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యులు కావాలనుకుంటే ప్రజలే వారికి తగిన జవాబు చెబుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఈ రాష్ట్రం మీద, విశాఖపట్నం మీద, ప్రజల మీద అభిమానం, ప్రేమ ఉంటే రెగ్యులరైజ్ ప్రక్రియను నిలిపివేయాలి. అయితే ఇంత పెద్ద భూకబ్జాకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు ఆ పనిచేస్తారని భావించడం లేదు. వారి తత్వం అలాంటిది. అందుకే మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కుంబా రవిబాబు, వైసీపీ సిటీ అధ్యక్షుడు కే కే రాజు, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి ఉమ్మడి స్వాతి దాస్, పళ్ళ దుర్గ , కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు, దౌలపల్లి ఏడుకొండల రావు, అక్కరమణి రోహిణి, కటారి అనిల్ కుమార్, మొల్లి లక్ష్మి, నక్కిల లక్ష్మి సురేష్, సాది పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వావిలపల్లి ప్రసాద్, రేయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, కెవిఎన్ శశికళ, పివి సురేష్, బల్లా లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష లతీష్, ఉరుకూటి రామచంద్రరావు (చందు), కో ఆప్షన సభ్యులు సేనాపతి అప్పారావు, ఎండి షరాఫీ, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, భూపతిరాజు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments