Sunday, April 19, 2026
HomeDevotionalనేడు బెజవాడలో టీ షర్ట్, బిబ్ పంపిణీ

నేడు బెజవాడలో టీ షర్ట్, బిబ్ పంపిణీ

శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ నమోదు చేసుకున్న వారికి అందజేత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఏపీ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ – 2026 కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 5గంటలకు విజయవాడ శారదా జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న బి ఆర్ టీ ఎస్ రోడ్డులో ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఐక్యతా భావనను పెంపొందించడం, ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా 60 ప్రధాన నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆదివారం ఉదయం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమై నామ సంకీర్తన (సర్వమానవ శాంతి కోసం భజనలు), దీప ప్రజ్వలన, స్వాగత ప్రసంగం, అనంతరం వార్మ్-అప్ సెషన్ (జుంబా), బాలవికాస్ పిల్లల సంగీత బృంద ప్రదర్శన జరుగుతాయి. అనంతరం ఉదయం 6 గంటలకు సైక్లింగ్ (5కే) కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, పురుషుల 5కే రన్‌ను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అలాగే మహిళల 5కే రన్‌ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) షేక్ షరీన్ బేగం తదితరులు జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏపీ అధ్యక్షులు ఆర్. లక్ష్మణరావు, ఇతర సీనియర్ పదాధికారులు కూడా పాల్గొంటారు. 15 సంవత్సరాలు, అంతకన్నా పైబడిన, అన్ని వర్గాలకు చెందిన నమోదిత (ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న) వారు ఈ 5కే రన్ అండ్ 5కే సైకిల్ రైడ్ కార్యక్రమాల్లో పాల్గొని ఐక్యత, సౌహార్దతను చాటుకోనున్నారు.
పేర్లు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఐడి గుర్తింపు పత్రంతో తమ ఉచిత టీ-షర్ట్ మరియు బిబ్ లను శ్రీ సత్యసాయి నిలయం (మందిరం), సీతారాంపురం, శ్రీ సత్యసాయి సర్కిల్, కొత్త వంతెన సెంటర్, ఏలూరు రోడ్, విజయవాడ లో ఫిబ్రవరి7న ఉదయం 7 గంటల నుండి రాత్రి 8గంటల మధ్య తీసుకోవాలని కోరారు. రిజిస్టర్డ్ చేసుకున్నవారికి
ఆదివారం రోజున టీ-షర్ట్ అండ్ బిబ్ పంపిణీ ఉండదని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాల కోసం శ్రీ మణికంఠ – 9248777749 శ్రీ బాల పవన్ – 9426612394 మరియు
శ్రీనివాస్ – 9948503231 లను సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments