రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి: స్థానిక జాంపేట రిజర్వ్ పోలీస్ లైన్స్‌లో శుక్రవారం శ్రీ కోదండ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్., తన సతీమణి లావణ్యతో కలిసి వధూవరులుగా పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళ్యాణ ఘట్టాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, రామాలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముడు సత్యం, ధర్మం, నీతికి ప్రతీకగా నిలిచాడని, ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) ఎల్. చెంచి రెడ్డి, డీఎస్పీ (ఎస్‌బీ) బి. రామకృష్ణ, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జాంపేట పోలీస్ లైన్స్‌లో వైభవంగా శ్రీ కోదండ సీతారాముల కల్యాణం
RELATED ARTICLES
