వార్డు నేతలకు స్వీట్ బాక్సులు పంపిణీ చేసిన వాసుపల్లి
పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియ 32వ వార్డులో విజయవంతంగా పూర్తి చేశారనీ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా 32 వ వార్డు అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో నాయకులకు కార్యకర్తలకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం ఉదయం వారిని ఘనంగా సత్కరించి స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
స్థానిక నాయకులను ఆయన అభినందించారు. త్వరిత గతిన ఈ ప్రక్రియ 100 శాతం పూర్తి చేశారని
వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే 95 శాతం పూర్తయింది అన్నారు. త్వరలోనే అన్ని వార్డుల్లో 100 శాతం పూర్తి కాబోతుందని చెప్పారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ అఖండ విజయం సాధించేదిగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందన్నారు.
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం తప్పదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. వైసిపి తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ సెక్రటరీ కనకల ఈశ్వరరావు, 32వ వార్డ్ ప్రెసిడెంట్ పినింట్ల రాజారెడ్డి, 30వ వార్డ్ ఇంచార్జి మరియు 32 వార్డ్ బూత్ కమిటీ ప్రెసిడెంట్ సూరపతి అప్పన్న,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ, వార్డ్ మహిళాప్రెసిడెంట్ కృష్ణవేణి, కోన జ్యోతి, స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ భాను మూర్తి,బంగారమ్మ,మాదిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాడుగుల నారాయణ మూర్తి,శ్రీను,ఇప్పక శ్రీను,జిల్లా జనరల్ సెక్రటరీ గణగాళ్ల రామరాజు,మజీ కార్పొరేటర్ పత్చిపిళ్లి రాము, 33వ వార్డ్ ప్రెసిడెంట్ ముత్తబాటుల రమేష్,రవి, సారధి, స్వప్న, గుర్రాల రామారావు, ఆశ జ్యోతి,బుర్రల చిన్న,ఉగిన్న భవాని తదితరులు పాల్గొన్నారు.
