` పురస్కారం అందించిన కమిషనర్ శంఖభ్రత బాగ్చి
ప్రముఖ యోగ , జీవన నైపుణ్య నిపుణులు ఇరోతి సతీష్ కుమార్ కు ప్రతిష్టాత్మక విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2026 లభించింది. సమాజంలో ఎంతో మందికి ఉచితంగా యోగ, ఆరోగ్య అవగాహన తరగతులు నిర్వహించారు. ఎన్నో వేలమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా ప్రేరణ తరగతులు లీడర్షిప్ స్కిల్స్ నేర్పించారు. అలాగే ప్రాణాపాయంలో ఉన్న రోగుల కోసం దాదాపు 43 సార్లు రక్తదానం చేసినందుకు తన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించి అందజేశారు. నగరంలోని దశపల్లా హోటల్లో విశాఖ నగర కమిషనర్ శంఖభ్రత బాగ్జి, సినీ నటులు రాజీవ్ కనకాల, డిప్యూటీ కమిషనర్ రవిశంకర్ మలిశెట్టి, ప్రైమ9 హెల్త్ ఫౌండర్ కిషోర్ కుమార్, తుమ్మిడి వస్త్రాలయం అధినేత తుమ్మిడి రామ్ కుమార్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. తనకు ఈ గౌరవం దక్కడంపై సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని భవిష్యత్తులో మరిన్ని వినూత్న శిక్షణా కార్యక్రమాలు, సమాజానికి మరింత సేవలు అందిస్తానని తెలిపారు.
యోగ, జీవన నైపుణ్య నిపుణునికి పురస్కారం
RELATED ARTICLES
