Home Politics Andhra Pradesh ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు స్వల్ప అస్వస్థత – చికిత్స అనంతరం డిశ్చార్జ్

ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు స్వల్ప అస్వస్థత – చికిత్స అనంతరం డిశ్చార్జ్

0

రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
శనివారం రాజమండ్రి పర్యటనకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు స్వల్ప అస్వస్థత కలగడంతో డెల్టా ఆసుపత్రిలో వైద్యుల ద్వారా చికిత్స అందించారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వివిధ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, వాటి అమలుకు జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఎన్‌సీఎస్‌సీ కార్యదర్శి గూడె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version