Home Politics Andhra Pradesh రాజమహేంద్రవరం చేరుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా

రాజమహేంద్రవరం చేరుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా

0

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా, కమిషన్ కార్యదర్శి శ్రీ గుడే శ్రీనివాస్ తదితరులు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం రాజమహేంద్రవరం లోని ఓఎన్‌జీసీ అతిథి గృహానికి చేరుకున్నారు.
వారికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు స్వాగతం పలికారు.
చైర్మన్ వెంట జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం సునీల్ కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్–అసెట్ మేనేజర్ హేమంత్ రామ్లు ముల్కా, జీజీఎం (ల్యాండ్ మేనేజ్‌మెంట్–వర్క్స్) టి.వి. శేఖర్, హెడ్ హెచ్ఆర్ సీజీఎం ఆర్.ఎస్. రామారావు, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ కొమ్ము సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఓఎన్‌జీసీ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version