క్రీడా కారిణికి ఘనంగా సత్కరించిన బిజెపి
ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మారుమూల గ్రామమైన పెద్ద సాన కు చెందిన బధిర క్రికెట్ క్రీడాకారిణి గొగ్గి రోహిణి ఈనెల 23 నుంచి 27 వరకు హర్యానా లో జరిగిన జాతీయస్థాయి డెఫ్టీ 10 క్రికెట్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది, ఆంధ్రప్రదేశ్ జట్టుకు రోహిణి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందని పలువురు గ్రామస్తులు పెద్దలు, హర్షం వ్యక్తం చేశారు,
ఈ సందర్భంగా టెక్కలి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఆమెను సాలువా కప్పి గ్రామస్తులతో సహా ఘనంగా సత్కరించారు, రోహిణి లాంటి క్రీడాకారులు తమ ప్రతిభను జాతీయస్థాయిలో చాటి చెప్పటం చాలా ఆనందదాయకమని మట్టిలోని మాణిక్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని టెక్కలి మండల బిజెపి అధ్యక్షులు కోటబొమ్మాలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ ర్జాన రాంజీ తెలిపారు.
రోహిణి వంటి క్రీడాకారులు మరెన్నో జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని పలువురు పేర్కొన్నారు, కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నడుపూరి లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ కోట శివరామరాజు, యువ మోర్చా సెక్రటరీ ధూపాన రాజకుమార్, మండల ఉపాధ్యక్షులు ఆకుల ప్రకాష్, కూన రమణ, బాపూజీ, జీవ రత్నం, ఎర్రన్న, వేణు గ్రామస్తులు పాల్గొన్నారు.
