Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshజి మాడుగుల మండలంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జి మాడుగుల మండలంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్  జిల్లాలో జరుగుతున్న పనులు నిర్దేశిత గడువు లోగా రహదారుల నిర్మాణ పనులను పూర్తిచేయాలని గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్, పిఐయు ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం జి మాడుగుల మండలంలో పరిధిలోగల పలు పనుల పురోగతిలో ఉన్న వివిధ గ్రామాల మధ్య రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలో కుంబిడి సింగి బ్రిడ్జి, బొయితలి నుండి గున్న లోవ మధ్య 15 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్డును, గుర్మతి నుండి గొడ్డుబుసలు మధ్య నరేగా నిధులతో 1.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బి టి రోడ్ల పనుల పురోగతి ఎంత మేరకు జరిగిందో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నిర్మాణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, మార్చి లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్మాణంలో మలుపుల వద్ద, గ్రామాల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం శారీరక, మానసిక ఆరోగ్యం ఉల్లాసం కొరకు క్రీడలలో పాల్గొనాలని, పలు మెలకువలు సూచిస్తూ స్థానిక యువతలో ఉత్సాహం నింపుటకు వారితో కలిసి వాలీబాల్ ఆడారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి డేవిడ్ రాజు, పి ఐ యు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొండయ్య పడాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments