మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా పులివెందుల పట్టణంలోని కోతి సమాధి వద్ద ఉన్న శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి డా.ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర శాస్త్రవేత్త డా.ఆర్ఎస్ఎస్ రూ.10,016 విరాళంగా అందజేశారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు తోడ్పాటు అందిస్తున్న డా.ఆర్ఎస్ఎస్
, సమాజ సేవలో భాగంగా ఈ విరాళాన్ని సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం గొప్ప పుణ్యకార్యమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా శ్రీ హర స్వామి, రవి స్వాములు దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను డా.ఆర్ఎస్ఎస్ కి వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం చేపడుతున్న చర్యలను తెలియజేశారు.
అనంతరం డా.ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా నిరంతర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజ అభ్యున్నతికి ఆధ్యాత్మిక కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
