Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshనూతన అంబులెన్స్ ప్రారంభం

నూతన అంబులెన్స్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సురెన్స్ వారి సౌజన్యంతో సమకూర్చిన నూతన అంబులెన్స్ ను కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ ఏ దినేష్ కుమార్ ప్రారంబించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ అంబులెన్స్ వల్ల ప్రమాదలకు గురైన వారిని అచ్య అత్యవసర సేవలు అందించుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ వాహనం డుంబ్రిగూడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి అందించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి కృష్ణమూర్తి నాయక్ తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి పాడేరు మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.ఎన్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments