Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradesh291మంది పోలీసులకు రివార్డులు

291మంది పోలీసులకు రివార్డులు

నేరుగా అందజేసిన కమిషనర్ శంఖ బ్రత బాగ్చి,సిబ్బంది సంక్షేమంతో పాటు, వారు అందించిన సేవల ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 291 మందికి రివార్డులను నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అందజేశారు. శుక్రవారం
జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్ లో గత నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేశారు. నగర పోలీసు శాఖలో హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గ గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్ధవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి తాజాగా ఇలాంటి చర్యలు తీసుకున్న విషయం విధితమే. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, చోరీ కాబడిన సొత్తు,ఇతర వస్తువులను రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులో, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 291 మంది వున్నారు. హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేసి, సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా క్రైమ్ నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డు మంజూరు ఆర్డరును విడుదల చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments