అంగన్వాడి వ్యవస్థ పటిష్టం చేయాలని 42 రోజులపాటు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీక్ష శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీ అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 23 ,24 ,తేదీల్లో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.
పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడి వేతనాలు పెంచాలని మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లు గా మార్చాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతూ, అంగన్వాడి వ్యవస్థ పటిష్టం చేయాలని అనేక పోరాటాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తినట్లు వ్యవహరిస్తూ అంగన్వాడి వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. అంగన్వాడి టీచర్లు వెల్పర్లు తమ జీవితాంతం పనిచేస్తున్న కనీస వేతనాలు అమలు చేయకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ఏజేన్సీ లో అద్దె భవనాలకు అంగన్వాడి సెంటర్లు నిర్వహిస్తున్నారు . కట్టెలు బిల్లులు గ్యాస్ బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు ఈవిధ రకరకాల యాప్ పెట్టి సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మారముల ప్రాంతాల్లో యాప్ సమస్య రోజురోజుకి పెరుగుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర ఏ సౌకర్యాలు లేకపోయినా అనేక సమస్యలు తట్టుకొని అంగన్వాడి వ్యవస్థ కొనసాగిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సౌకర్యాలు అంగన్వాడీలకు వర్తించడం లేదు ధరలకు అనుగుణంగా జీతాలు లేకుండా అన్ని రకాల బెనిఫిట్స్ వర్తించకుండా ప్రభుత్వ పథకాలు ఆపివేయడం ద్వారా అంగన్వాడీలు నష్టపోతున్నారు. ప్రతిపక్ష ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత డిమాండ్లు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ ప్రెసిడెంట్ దురియ నిర్మల, కొర్ర లక్ష్మి,పి.గౌరమ్మ,కె.సీత,టి.గౌరమ్మ,బి.భగ్యలక్ష్మి,పి.లలితకుమారి,ఎస్.నాగమ్మ , ఎస్.శారధ, తదితరులు పాల్గొన్నారు.
