జీవీఎంసీ కార్యాలయంలో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుని 85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి, ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు 85 వార్డు అభివృద్ధి కార్యక్రమాలకి ఇటీవల సుమారు 13 కోట్లు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి చెందలేని విలీన గ్రామాలు ఎక్కువగా ఉన్న నూతనంగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించాలని, ఫార్మా సిటీకి వెళ్లే బస్సులు హిందూజా, ఎన్టిపిసి వేళ్లు బొగ్గు లారీలు లంకెలపాలెం సెంటర్ నుండి కాకుండా డొంకాడ బ్రిడ్జి పక్కనుండే ఫార్మాసిటీ వరకు నూతన రోడ్డు వెయ్యాలని, అగనంపూడి నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబల్ రోడ్డు చేసి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, క్రీడా మైదానం, వాంబే రాజీవ్ గృహ టీడ్కో మంగలపాలెం ప్రాంతాల్లో నివాస పూర ప్రజలు అగనంపూడి రావటానికి తలారివాని పాలెం రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి రోడ్డు వెయ్యాలని, ఫార్మాసిటీ కాలనీ కొరకు స్మశానం ఏర్పాటు చేయాలని, పూడివానిపాలెం గ్రామంలో సామాజిక భవనం నిర్మించాలని, పెదమడక సూది కొండ దిగువ నివాస ప్రజలకు సౌలాభ్యంగా మంచినీటి కొళాయిలు వెయ్యాలని వినతి పత్రం అందజేసారు.
సమస్యలపై మేయర్ పీలా శ్రీనివాసరావుకి వినతి
RELATED ARTICLES
