Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshమంత్రుల గృహాల పై దాడులు అన్యాయం..

మంత్రుల గృహాల పై దాడులు అన్యాయం..

టిడిపి అరాచక పాలన కు
చరమ గీతం పాడాలి
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్కనపెట్టి సొంత అజెండాతో బ్లడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి ధ్వజ మెత్తారు.రాష్ట్ర మాజీ మంత్రులు జోగి రమేష్ అంబటి రాంబాబుగృహాల మీద తెదేపా మూకలు పెట్రోల్ బాంబులు కర్రలు ఇతర ఆయుధాల తో దాడి చేయడం అమానుషం అని ఇందుకు బాధ్యు లను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఆఫీస్ లోని తమ ఛాంబర్ నందు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
బత్తిన మాట్లాడారు.
ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతిరోజు ఒక అంశంగా జరుగుతుందని ఒక బీసీ మాజీ మంత్రిని అక్రమ కేసులు ఇరికించిందే కాకుండా మానసికంగా ఇబ్బంది పెట్టడం వారి కుటుంబాన్ని భయభ్రాంతులను చేయటం ఎంతవరకు సమంజసమని ఆమె అన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి వారి విలువైన కార్లను సామాగ్రి ని ఇంటిని
ధ్వంసం చేసింది కాకుండాఆయన్ను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది విలువల తో కూడిన రాజకీయం కాదని దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని టిడిపి అరాచక పాలనలో తర్వాత బలికాబోయేది ప్రజలేనని పేర్కొన్నారు.
దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఇప్పటికైనా అరాచకాలు ఆపి ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments