పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆదర్శనీయులు – బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కేఎన్ఆర్ ,స్వర్గీయ పండిత్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ సందర్భంగా గాజువాక పాతకర్నవానిపాలెం బిజేపి కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ జన్ సంఘ్ పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు. అంత్యోదయ ఏకాత్మ మానవతా దర్శనం సిద్ధాంతం ద్వారా అట్టడుగున ఉన్న పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని సూచించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు ,కృష్ణంరాజు ,శంకరరావు ,సోంబాబు, రోహిణి ,పావని ,మనోహర్ ,కృష్ణారెడ్డి ,లలిత ,ముసలయ్య ,మనోహర్,నాగేశ్వరరావు , రమాదేవి , రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఘణంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్
RELATED ARTICLES
