వి ఎం ఆర్ డి ఏ కార్యాలయం లో ఉన్న
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం. వి ప్రణవ్ గోపాల్ పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 90 వ్యవస్థపాక దినోత్సవం పురస్కరించుకొని కేక్ కటింగ్ చేసారు. ఈ సందర్బంగా చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ దేశ బ్యాంకింగ్ రంగంలో ఐ ఓ బీ కు ఉన్న చరిత్ర, సేవలు ఆదర్శప్రాయమైనవి కొనియాడారు. విశాఖపట్నం వుడా బ్రాంచ్ లో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరపటం ఆనందకరం గా ఉందన్నారు.
ప్రజల విశ్వాసమే ఐ ఓ బీ యొక్క అసలైన బలమని పేర్కొన్నారు.
బ్యాంకింగ్ సేవలతో పాటు, సామాజిక బాధ్యతలో ఐ ఓ బీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. అనంతరం బ్యాంకు ఆవరణలో నిర్వహించిన ఉచిత దంత, కళ్ళ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ జాయింట్ కమిషనర్ కె.రమేష్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వై. హరి ప్రసాద్, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
వుడాలో ఘనంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం.
RELATED ARTICLES
