కూటమి ప్రభుత్వం తాడి తరలింపు పై కట్టుబడి ఉంది
– గ్రామస్తులను సీఎం వద్దకు తీసుకెళ్తా
– పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తాడి గ్రామాన్ని తరలింపు చేయాలంటూ మంగళవారం తాడి అఖిలపక్ష నాయకులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును పెందుర్తి లోని క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన ఏ హామీని మర్చిపోలేదని ఇందులో భాగంగా గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో తాడి తరలింపు ప్రస్తావన చేశానని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా అధికారులకు ఈ తాడి గ్రామ తరలింపు విషయంపై ఆదేశాలు కూడా ఇచ్చారని అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ప్రతిసారి ఫార్మా కాలుష్యంతో తాడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, గ్రామ తరలింపు ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఉన్నానని, దీనికి ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. రేపటి నుంచి నెల రోజులు పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరొక్కసారి తాడి తరలింపు విషయం ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్మెంట్ తీసుకొని తాడి గ్రామస్తులను ఆయన వద్దకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడి గ్రామానికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.
తాడి తరలింపు పై మరోసారి అసెంబ్లీలో ప్రస్తావిస్తా
RELATED ARTICLES
