Saturday, April 18, 2026
HomeUncategorizedఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం

ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం

  • ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం
  • మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ

భీమవరం ; జయ జయహే
ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రమని, శక్తివంతమైన శివ మంత్రాలను పఠించడం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగడ నమ్మకమని పలువురు వక్తలు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మానేపల్లి వెంకన్న బాబు 65 వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం వారి నివాసం వద్ద శంభో సత్సంగం తటవర్తి కిరణ్ నిర్వహించారు. అనంతరం పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండాడ బంగారాజు, కారుమూరి సత్యనారాయణ, కోట్ల నాని మాట్లాడుతూ ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికీ పంచభూతాలే జీవనాధారమని, ఆ శివుడు మాత్రం ఆ పంచభూతాలు సైతం తానే అంటారాని, పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపులని అన్నారు. అంతటి శక్తివంతమైన పరమిశివుడిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు.
నిడంబరుడు స్నేహశీలి సేవాతాత్పరుడు అందరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి వెంకన్న బాబు అని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమం లో బొడ్డు వాసు, కారుమూరి బదరి, తటవర్తి నారాయణ, కొప్పర్తి అప్పారావు, కంచర్ల భాస్కరరావు,పరుచూరి నాగేశ్వరావు, మణి, మానేపల్లి రవి చిన్నారావు, చవ్వ భామ కృష్ణ మూర్తి, గుండు సుమూర్తి,కుటుంబ సభ్యులు,బంధువులు,భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments