Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshగోకవరం జామియా మసీదులో ఎంపీపీ ఇఫ్తార్ విందు

గోకవరం జామియా మసీదులో ఎంపీపీ ఇఫ్తార్ విందు

గోకవరం జయ జయహే ప్రతినిధి జామియా మసీదులో పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపట్టిన వందమంది ముస్లిం సోదరులకు వైసిపి పార్టీ సీనియర్ నాయకులు ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, ఇఫ్తార్ విందు గా బిర్యాని ప్యాకెట్లను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రంజాన్ పండుగ లో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు మా వైసీపీ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. మంగళవారం సాయంత్రం జామియా మసీదులో వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ను ఇచ్చారు. 30 రోజులు జామియా మసీదులో కటిక ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి కులమతాలు అనే తేడా లేకుండా ముస్లిం సోదరులతో పాటు మేము కూడా ఇఫ్తార్ విందులో పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీపార్టీ నాయకులు దాసరి చినబాబు, సుంకర రమణ, నరాల శెట్టి నరసయ్య, నాని, చిన్న, బుజ్జి, జామియా మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments