Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshగోవాడ సుగర్స్ రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయండి

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయండి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చోడవరం మండలం మహాసభ వాకర్ క్లబ్ లో సోమవారం నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి ఎస్వీ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నయన్ బాబు మాట్లాడుతూ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు కార్మికులు బకాయిలు 34 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు కార్మికుల బకాయిలు సంవత్సరం అయినా ఇప్పటివరకు చెల్లించకపోవడం పచ్చి దుర్మార్గమని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద 22 రోజులపాటు నిరాహార దీక్ష చేయగా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వచ్చి రైతులు కార్మికుల బకాయిలు నెల రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ హామీ అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రైతులు కార్మికులు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యేలు ఇద్దరు గతంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చొరవ తీసుకోవాలని
రాష్ట్ర ప్రభుత్వం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆధునికరణకు 100 కోట్లు నిధులు కేటాయించాలని రైతులకు కార్మికులకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు సీఎం రమేష్ గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆధునికరిస్తాం మళ్లీ పూర్వవైభం తీసుకొస్తాం చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మరిచారా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.
వి బిజి రాంజీ ఉపాధి చట్టం రద్దు చేయాలి పాత చట్టాన్ని కొనసాగించాలి 200 రోజులు పని రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని
రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర అమలకు పార్లమెంట్లో మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని
2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని బలవంత భూసేకరణ ఆపాలని తీర్మానించారు. సందర్భంగా
నూతన కమిటీ ఎన్నికయింది. మండల అధ్యక్షులు గంగేశ్వర్ రావు కార్యదర్శి ఎస్ వి నాయుడు
సహాయ కార్యదర్శి
బి దేవుళ్ళు
ఉపాధ్యక్షులు తాతారావు గౌరవ అధ్యక్షులు
మల్ల కోటేశ్వరరావు ఎక్స్ ఎంపీపీ
కమిటీ సభ్యులు
సిహెచ్ వెంకట అప్పారావు తనకాల జగన్
బోను అప్పలనాయుడు
సరగడం అప్పారావు
పీలా రామ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments