Sunday, May 31, 2026
HomeDevotionalఅమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలి-ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలి-ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం (జయ జయహే): నూతనంగా నియామకమైన శ్రీ కనకమహాలక్ష్మి ఉత్సవ కమిటీ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ఈవోతో కలిసి సమావేశం కావడం జరిగింది.
అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ లో నియమించిన సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. సుమారు నెలరోజులు పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.


గత ఏడాది కంటే ఈ ఏడాది సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ అలాగే ఉత్సవ కమిటీలు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 32 వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments