విశాఖపట్నం, జయ జయహే మద్దిలపాలెం: కృష్ణ కాలేజ్ రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మరియు డాబాగార్డెన్స్ లో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోణి శివ రామ కృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం (రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు) ను పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యులు గొల్ల బాబు రావు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యులు గొల్ల బాబు రావు మాట్లడుతూ ..ఆర్ధిక, సామాజిక రాజకీయ రుగ్మతలను రాజ్యాంగం తొలగించింది అని ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన రాజ్యాంగం మనది. రాష్ట్రంలో నేడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు కూటమి పాలనలో అన్యాయం జరుగుతుంది అని అన్నారు . జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు మాట్లడుతూ ..భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది అని అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది అంబేద్కర్ రాజ్యాగాన్ని కాదని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారు అని అన్నారు బడుగు బహిన వర్గాల వారికి వైఎస్ జగన్ రాజ్యాధికారం కల్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి , బొల్లవరపు జాన్ వెస్లీ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ , మళ్ళ విజయ ప్రసాద్ , మొల్లి అప్పారావు ,మాజీ శాసన సభ్యులు తైనాల విజయకుమార్ , రాష్ట్ర జిల్లా , నియోజకవర్గ,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
