Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshకూటమి పాలకులకు బుద్ధి ప్రసాదించండి స్వామి

కూటమి పాలకులకు బుద్ధి ప్రసాదించండి స్వామి

దేవుని మీద రాజకీయులు వద్దు,వాస్తవాలు తెలిసినా వదలని తప్పు ప్రచారాలు,కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పుడు ఆలోచనలతో రాజకీయాలకు ఉపయోగించుకోవడం భావ్యం కాదని ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం తగదని టెక్కలి వైసీపీ ఇంచార్జి పేరాడ తిలక్ అన్నారు. ఈ మేరకు టెక్కలిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సిపి ప్రతినిధులు పూజలు నిర్వహించారు.

ప్రజలు భక్తులను తప్పుడు ఆలోచనలకు గురిచేసి అలజడి చేయడం కూటమి పరి పాలకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాస్తవాలను పరిశీలించాలని న్యాయస్థానాలు , సీబీఐ చెప్పినప్పటికీ వారి తప్పుడు ఆలోచనలు ఇంకా ప్రజలపై రుద్దడం విచారకరమని తిలక్ అన్నారు. తిరుమలలో అపచారం పేరిట పూజలు నిర్వహించడం విచారకరమన్నారు, తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వును వాడారని చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు, సి.బి.ఐ సిట్ దర్యాప్తులో నెయ్యి కల్తీ లేదనీ తేటతెల్లమయిందని కూటమి ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి బుద్దిని ప్రసాదించాలని తిలక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments