రాజమండ్రి సిటీ దానవాయిపేటలోని టీటీడీ కళ్యాణ మండపం ఆలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు ఘోర అపచారానికి ఇది ప్రతీకగా నిర్వహించిన కార్యక్రమమని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్డిడిబి, ఎన్డిఆర్‌ఏ చేసిన పరీక్షల్లో తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వులు లేవని తేలడం భక్తులకు ఊరటనిచ్చిందన్నారు. చంద్రబాబు ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని, ఆయన హయాంలో సరఫరా అయిన నెయ్యిపైనే ఇప్పుడు ఆరోపణలు చేశారని భరత్ విమర్శించారు. తప్పులు చేసి వాటిని ఇతరులపై నెట్టివేయడం చంద్రబాబు రాజకీయ నైజమని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం దేవుణ్ణి కూడా వదలని కుట్రలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
