గత 11 ఏళ్లుగా కొత్తకోట లో రాజన్న ఫౌండేషన్ చైర్మన్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలులో భాగంగా ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 13 అడుగుల ఎత్తు గల మట్టితో తయారుచేస్తున్న శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దానికి” తపస్వి” గా నామ కరణం చేశామని అన్నారు.శివరాత్రి రోజున సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ప్రత్యేక పూజలు, తదుపరి భారీ ఎత్తున కూచిపూడి భరతనాట్యం సాంస్కృతిక ఫ్యూజన్ భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని, అలాగే సంప్రదాయ బద్ధమైన సంగీత నృత్య కార్యక్రమాలను తిలకించడానికి, రాత్రి జాగరణ కు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు.వచ్చిన భక్తులందరికీ ప్రసాదం, టీ తదిత సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని , కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని రాజు చెప్పారు.
కొత్తకోట లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఏర్పాట్లు
RELATED ARTICLES
