మద్యం దుకాణాల చుట్టూ అనధికారికంగా షాపులు..
పర్మిట్ రూమ్‌లకు అనుమతులు లేవు..
చోద్యం చూస్తున్న సంబంధిత యంత్రాంగం..
మద్యం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. మద్యం దుకాణాల చుట్టూ అనధికారికంగా షాపులు వెలుస్తున్నాయి. అక్కడే మద్యం తాగుతుండడంతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఓజిలి మండలంలో 3 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే చాలా వరకూ షాపుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాల చుట్టూ ప్రాంతాల్లో ఎటువంటి కూల్ డ్రింక్ షాపులు , మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించడం అలాంటివి చట్ట విరుద్ధంగా ఉన్నప్పటికీ మద్యం సిండికేట్ మాఫియా అదేమీ పట్టనట్లు బహిరంగంగానే మద్యం దుకాణాల వద్దనే ఇచ్చినవిడిగా మద్యాన్ని తాగిస్తున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన వారు చుట్టుపక్కల ఉన్న ఇతర షాపులను సైతం అద్దెకు తీసుకుంటున్నారు. అక్కడ తమ వారితోనే ఫాస్టుఫుడ్ సెంటర్లు, పాన్ షాపులు పెడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీతినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావుతీస్తుంది. మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఎటువంటి పర్మిట్ రూమ్‌లకు అనుమతివ్వలేదు. మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అదనంగా రూ.5 లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదును దుకాణదారులు చెల్లించకుండానే వారు కేటాయించుకున్న షాపుల్లో మద్యాన్ని బహిరంగంగ తాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తుంటే అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధ�
