అంగన్వాడి దశనుండే పిల్లల్ని ఆటపాటలతో పాటు విద్యాబుద్ధులు నేర్పితే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఎంపీడీవో శివప్రసాద్ నారాయణ ఐసిడిఎస్ పిఓ మంగతాయారు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం లోపూడి 2 అంగన్వాడి కేంద్రాన్ని వారు పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో ఉన్న పిల్లలను వాళ్ళు చదివే విధానాన్ని చూసి అభినందించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పిల్లల ఫ్రీ స్కూల్ విధానాన్ని మెరుగుపరచాలని తెలిపారు. పిల్లలకు అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. మెనూ క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు. సెంటర్ పరిధిలో ఉన్న స్టాకులను పరిశీలించారు గుడ్లు పాలు వచ్చేటప్పుడు ఎక్స్పరి డేట్ చూసి తీసుకోవాలని తెలిపారు. నిల్వ వస్తువులు నిలువ ప్యాకెట్లు ఉంచు రాదని తెలిపారు. సెంటర్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలో ఉన్న పిల్లలకు గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అలాగే సెంటర్ పరిధిలో వికలాంగ పిల్లలు కానీ బరువు తక్కువ ఉన్న పిల్లల గాని ఉంటే వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటువంటి పిల్లలు ఉన్నట్లయితే ముందుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మలాదేవి అంగన్వాడి కార్యకర్త కడియం జ్యోతి సునీత పాల్గొన్నారు.
