జయజయహే వార్త కు స్పందన
కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో గోదావరి తీరంలోని గోష్పాద క్షేత్రాన్ని ఆనుకుని రూ.1.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన గోదావరి బండ్ పార్క్‌లో ఎట్టకేలకు వీధి దీపాలు వెలిగాయి.
పార్క్‌లో వీధి దీపాలు వెలగకపోవడం, వాకింగ్ ట్రాక్ శుభ్రత లేకపోవడం వంటి సమస్యలపై ఈనెల 7న జయజయహే దినపత్రికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
పార్క్ పరిసరాల్లో వాకింగ్ ట్రాక్‌ను శుభ్రపరచడంతో పాటు నిలిచిపోయిన వీధి దీపాలను మరమ్మతు చేసి వెలిగేలా ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
పార్క్‌లో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. స్థానికులు కూడా సమస్యపై స్పందించి చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.

