- న్యాయం జరిగేలా చొరవ తీసుకోండి
- అన్యాయానికి దిగితే ఉపేక్షించేది లేదు
- రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ
శ్రీకాకుళం – జయ జయహే
ఎండియూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో టెక్కలి ఎండియు ఆపరేటర్ పిట్ట.నరేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ కు, జిల్లా ఎస్పీ కి, వినతిపత్రాన్ని అందజేసి సత్వర న్యాయంజరిగేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకు వినతిపత్రాన్నందించి మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్ గా విధులు నిర్వహించడం భారంగా ఉందని ఆపరేటర్ ఉద్యోగానికి, పువ్వుల డిల్లీశ్వరావు 01.05.2022 తేదీన రాజీనామా చేశారని, విషయం తెలుసుకున్న నేను 26- 07- 2022 తేదీన స్థానిక ఎమ్మార్వోను కలిసి, ఎండియు ఆపరేటర్ ఉద్యోగం కాలీగా ఉందని తెలుసుకుని వచ్చానని, మాకు ఉపాధి చూపించండని కోరగా, పాత ఎండియు ఆపరేటర్ వెహికల్ ని మీకు అందించాలంటే ఆయన ప్రభుత్వంకు కట్టిన నగదు 65 వేలరూపాయలు, ఆయనకు మీరు చెల్లించాలని, స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డిప్యూటీ తాసిల్దారు నాకు తెలియజేసారని, ఈ విషయంపై నేను నగదును సమకూర్చుకొని 31-072022, ఆన్లైన్ ద్వారా (ఫోన్ పే) పాత ఎండియు ఆపరేటర్ పువ్వుల ఢిల్లీ రావుకు డబ్బులు చెల్లించానని, ఇకపై అతనికి ఈ వెహికల్ కి ఎటువంటి సంబంధం లేదని, ఆగస్టు ఒకటో తారీకు నుండి వెహికల్ కి సంబంధించి విధినిర్వహణలో పూర్తి బాధితులు మీవే అని నాకు తెలిపారు అప్పటినుండి 17-05-2025 తారీకు వరకు మేము విధులు కొనసాగించడం జరిగిందని, అందులో భాగంగా 35 నెలల కాలం ఎండియు ఆపరేటర్ గా నేను విధులు నిర్వహించానన్నారు. ఈ 35 నెలల కాలం నెలకు మూడు వేల రూపాయలు, నా జీతం నుండి లక్ష ఐదు వేల రూపాయలు కట్ చేయడం జరిగిందని, వాహన ఇన్సూరెన్స్ అమౌంట్ 9200/ రూపాయలు కట్ చేశారని, ఈ మూడు సంవత్సరాల కాలం, నా వెహికల్ మెయింటినెన్స్ కి సంబంధించి రిపేర్ చార్జీల కొరకు 40 వేల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 1-06-2025 నుండి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేశారని, ఇప్పటికీ 6 నెలలు కావస్తుండగా, ఇప్పుడు పువ్వుల ఢిల్లీ రావు, నాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా నా వాహనాన్ని స్థానిక పోలీసులు ద్వారా తప్పుడు కేసు పెట్టి, నా వద్ద నుండి 1-11-2025 శనివారం తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నా వాహనాన్ని తిరిగి నాకు ఇచ్చేలా చేయాలని, లేదా ఇప్పటివరకు జరిగిన నష్టపరిహారాన్ని ఇప్పించి నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండియు ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ విది నిర్వహణ నుండి తొలగిన ఎండియు ఆపరేటర్ ఈ విధంగా దౌర్జన్యానికి దిగడం సరికాదని ఇటువంటి చర్యలను యూనియన్ ఉపేక్షించేది లేదని ఢిల్లీరావు కట్టిన అమౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగినప్పటికీ ఈ విధంగా అన్యాయానికి పాల్పడడం తగదని తక్షణమే ఇటువంటి చర్యలు మానుకోకపోతే తీవర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఒప్పందం అయిన తర్వాత పోలీసు వారి అతి ఉత్సాహం ఏంటని ఎద్దేవా చేశారు అనంతరం ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ, నీ కలిసి యూనియన్ తరపున నరేష్ సమస్యను వివరించడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ, సానుకూలంగా స్పందిస్తూ ఆపరేటర్ నరేష్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ అప్పటికి తమకు న్యాయం జరగకపోతే యూనియన్ తరపున నాయిస్థానానికి ఆశ్రయించడానికి కూడా వెనుకాడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల ప్రెసిడెంట్ కార్తిక్, పిట్ట నరేష్, శివ కృష్ణ, జానకిరామయ్య , తదితరులు పాల్గొన్నారు.
