Saturday, April 18, 2026
HomeUncategorizedప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా డ్రోన్లు ఎగర వేస్తే కఠిన చర్యలు-అరకు సీఐ హిమగిరి

ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా డ్రోన్లు ఎగర వేస్తే కఠిన చర్యలు-అరకు సీఐ హిమగిరి

అరకులోయ: జయ జయహే.

అరకువేలి అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి డ్రోన్స్ సర్వే నిలిపివేయబడింది అని. రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన చేసి కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రి ఆదేశాలు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ .జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అమిత్ బర్దర్ ఆదివాసి సంఘ నాయకులు ప్రజా ప్రతినిధులు పెసా కమిటీ నాయకులతో సమావేశ పరిచి సర్వే నిలిపివేయబడింది. గ్రామసభ పెసా అనుమతులు లేనిదే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు అని తెలియజేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యజమాన్యానికి సర్వే నిలిపివేయబడింది అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మా గ్రామాల్లో డ్రోన్లు ఎగురు తున్నాయి అని కలెక్టర్ కు ఎస్పీ కు ప్రజల ద్వారా తెలియడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లు తక్కువ ధరకే డ్రోన్లు దొరకడం వలన కొంతమంది డ్రోన్స్ ను కొని సరదాకో లేదా కావాలనే ప్రజలను రెచ్చగొట్టలనే ఈ డ్రోన్లు లను ఆదివాసి ప్రాంతంలో ఎగుర వేస్తున్నారు. ఈ విధంగా ఆదివాసి ప్రాంతంలో ప్రజలకు రెచ్చగొట్టే విధంగా ఎగురవేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దీనిపై అనంతగిరి అరకు వేలి లో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి నిఘా ఉంచాము అని అరకు సీఐ హిమగిరి తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments