జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్
1పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మిస్తున్న నిర్మాణ పనులు పై నియోజకవర్గాల వారీగా, లేఔట్ లో వారీగా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 3 నుండి 4 నెలలు గృహ నిర్మాణాలకు అనువైన వాతావరణం ఉంటుంది కనుక గృహ నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. గృహ నిర్మాణ పనులలో వెనుకబడి ఉన్నవారు అదనంగా లేబర్ను నియమించి పనులు చేయాలన్నారు. నిర్మాణం పనులను పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తానని, గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణ ప్రగతిలో వెనుకబడిన అధికారులకు తాఖీదులు జారీ చేయాలని పీడిని ఆదేశించారు. పి.ఎం.ఏ.వై. గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జోనల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు గృహాల పురోగతిపై దృష్టి సారించాలన్నారు. వివిధ దశలలో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సత్తిబాబు, భీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి సంగీత్ మాధూర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, డిఈ ,ఏఈ లు పాల్గొన్నారు.
