స్వాగతం పలికిన బీజేపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం విశాఖపట్నం విచ్చేసారు. ఈ సందర్భంగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. బిజెపి నాయకులు బాల రాజేశ్వరరావు, రవీందర్ రెడ్డి, దీపిక రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాలువతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో విమానాశ్రయ ప్రాంగణం పార్టీ కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది.
ఈ కార్యక్రమంల స్థానిక బిజెపి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆయన విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
