ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని, వాటిని నివారించడానికి సమతుల్య ఆహారం, నియమిత వ్యాయామం, మరియు పర్యాయ కాలిక ఆరోగ్య పరీక్షలు అత్యంత అవసరమని సూచించారు.
ఆసుపత్రి వైద్యులు ప్రజలకు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, చిన్న లక్షణాలు కనిపించినప్పుడే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించడం ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.”
హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ కె . తిరుమల ప్రసాద్ మాట్లడుతూ విజయనగరం తిరుమల
మెడికవర్ హాస్పిటల్స్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
