Home Politics Andhra Pradesh ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత

ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత

0

అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు

స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి

రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరిగేలా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన అందరికీ ఇంటి పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన అన్నారు, జగతిమెట్ట పరిసర ప్రాంతాల్లోనే స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు, అర్హత లేని జాబితా ను సిద్ధం చేశామని అందులో కొంతమందిని తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు నిజమైన లబ్ధిదారులు కు ఆయన న్యాయం చేస్తామన్నారు,

అవసరమైన మౌలిక సదుపాయాలు రహదారులు విద్యుత్తు మంచినీరు వంటి సదుపాయాలను కాలనీలో కల్పిస్తామన్నారు, కాలనీవాసులు తమ వద్దనున్న అధికారిక పత్రాలను స్థానిక ఆర్డిఓ కార్యాలయానికి తీసుకెళ్లి తమ అర్హత పత్రాలను చూపించాలని మంత్రి సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు , 412 ఇళ్ల స్థలాల కు సంబంధించి ఎ లాంటి అర్హతలు లేవని రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు దృష్టికి తీసుకువచ్చారు.
సంబంధిత ఇళ్ల స్థలాలపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డిఓ ఎం కృష్ణమూర్తి, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్, కోట బొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బ గాది శేషగిరిరావు, అధికారులు అన అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version