Sunday, April 19, 2026
HomeNationalప్రతిరోజూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవమే

ప్రతిరోజూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవమే

పర్యావరణ పరిరక్షణ అందరి మన బాధ్యత
ఎన్ రామచంద్ర రావు, డి ఎఫ్ ఒ, కాకినాడ జిల్లా
ప్రతిరోజూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవమే అని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్ర రావు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం అటవీ శాఖ కార్యాలయంలో ఆదిత్య విద్యా సంస్థ, ఆల్ ఈజ్ వెల్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ లో నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల కాలమానిని జిల్లా అటవీ శాఖ అధికారి ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని లేకుంటే పెను నష్టం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు. ఈ కాలమానిని వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని వివరించారు.
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర‌‌‌ కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బర్డ్స్ మేన్ కె మృత్యుంజయ రావు, ఆల్ ఈజ్ వెల్ ప్రతినిధి కిషోర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ సోషల్ వర్కర్స్ ఒ కిషోర్, శ్రీను, గ్రీన్ క్లైమేట్ వాలంటీర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments