రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆధునికరణకై, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లింపుకై బడ్జెట్ కేటాయించకపోవడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోనే సహకార రంగంలో నడుస్తున్న ఏకైక గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది క్రషింగ్ ను సైతం చేయకుండా ఈ ప్రాంతంలో చెరుకును మరో జిల్లాకు తరలించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గత ఏడాది చెరుకును సరఫరా చేసిన రైతాంగానికి కష్టపడి పనిచేసిన కార్మికులకు బకాయిలను చెల్లించ లేదన్నారు. రైతులు కార్మికులకు కేవలం 30 కోట్ల రూపాయలు బకాయిల చెల్లింపుకు మరో 100 కోట్ల రూపాయలను ఫ్యాక్టరీ ఆధునికరణకు చెల్లిస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుందన్నారు. ఈ నేపద్యంలో ఫ్యాక్టరీ ఆధునికరణకై రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని నిధులు కేటాయించినట్లయితే గోవాడ సాగర్ ఫ్యాక్టరీ మళ్లీ పట్టాలెక్కుతోందని అన్నారు. తద్వారా చోడవరం మాడుగుల నియోజవర్గాల్లో రైతాంగానికి వెన్ను తన్నుగా నిలబడేదని అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కూడా ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నాయని వీటిని కూడా చెల్లించటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గం అని అన్నారు. బడ్జెట్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆధునికరణకై నిధులు కేటాయించడం కోసం ఈ ప్రాంత రైతాంగం కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు.
బడ్జెట్ లో షుగర్ ఫ్యాక్టరీలకు మొండి చేయి చూపడం అన్యాయం
RELATED ARTICLES
