డుంబ్రిగూడ: జయ జయహే: మండలంలోని గసబ గ్రామ పంచాయతీ, జంగిడివలస గ్రామంలో సర్పంచ్ పాంగి సునీత సందర్శించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .గ్రామ పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు 3లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రజలు సహకారం అదించాలనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో గసబ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్, వార్డ్ మెంబర్స్ పాంగి సత్యనారాయణ, కిల్లో క్రిష్ణా, పెసా కార్యదర్శి వంతల మోస్యా, పద్దు బాస్కరరావు, సిపిఎం పార్టీ నాయకులు పాంగి దొరబాబు, గ్రామ పెద్దలు, మహీళలు పాల్గొన్నారు.
