విశాఖపట్నం జయ జయహే: స్వర్గీయ మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విసృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.. బుధవారం డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహ్వాన కమిటీ తరఫున జనసేన పార్టీ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్..పసుపులేటి శేఖర్ లు మాట్లాడుతూ డిసెంబర్ 14న నగరంలోనీ విఎంఆర్డిఏ బాలల ప్రాంగణంలో మిర్యాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా మిరియాల జయంతి వేడుకలను ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్నామని డిసెంబర్ 14న పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మిరియాల వెంకటరావు చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించడంతోపాటు ఆయనపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని కూడా ఆయన తనయుడు సీనియర్ ఐఏఎస్ అధికారి మిరియాల శేషగిరి బాబు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.. శత జయంతి ఉత్సవాలు నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.. ఆయన జయంతి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామన్నారు.. ఆహ్వాన కమిటీ తరఫున గంట్ల శ్రీనుబాబు, కే వి వి సత్యనారాయణ .. జెర్రి పోతుల మోహన్ కుమార్ లు మాట్లాడుతూ మిరియాల ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామన్నారు.. ఇప్పటికే మిరియాల పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో కోటపోతుల శ్రీనివాస్ ఆకుల మురళి.. సుబ్బు విశ్వనాథ్ తదితరులతో కలిసి ఆహ్వాన కమిటీ ప్రతినిధులు అంతా మిరియాల 86 వ జయంతి వేడుకలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించారు.
14న స్వర్గీయ మిరియాల వెంకటరావు జయంతి వేడుకలు
RELATED ARTICLES
