Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshఆందోళన చేపట్టిన బోర్వెల్ అసోసియేషన్

ఆందోళన చేపట్టిన బోర్వెల్ అసోసియేషన్

బోర్ వెల్స్ సామాగ్రి ధరలు తగ్గించాలని డిమాండ్

బోర్ వెల్స్ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉమ్మడి విశాఖ జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చోడవరం మండలం నరసయ్యపేటలో అసోసియేషన్ జిల్లా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు పెరుగుదల వల్ల సమ్మె చేపడుతున్నామని తెలిపారు. బిట్లు, హైమర్, ఇతర సామాన్ల ధరలు బాగా పెరిగాయన్నారు. వర్కర్స్ జీతాలు పెరగడం వల్ల బోర్ వెల్స్ వాహనాల నిర్వహణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిట్లు ధరలు తగ్గించి వినియోగదారులకు అందుబాటులో తేవాలని కోరారు.ఏపీ విభజన కారణంగా బోర్ వెల్స్ తయారీ రంగం తెలంగాణలోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఏపీలో కూడా తయారీ రంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బోర్ వెల్స్ సంబంధించి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తే ఎంతోమంది జీవనోపాధి పొందుతారని తెలిపారు. అధ్యక్షులు ప్రభుజీ, నాని, డి సంతోష్, గండ శీను, ప్రసాదు, సురేషు, దిలీపు, రాజేంద్ర, వైజాగ్ అసోసియేషన్ సభ్యులు నవీన్ రెడ్డి, బాలరాజు, వెంకటేశ్వర, ఎస్ వి ఎస్ చిన్న , కాంటాక్ట్స్ రాజు, సతీష్ ,సురేషు ,చిట్టిబాబు, సంజీవ్ ,మంగ నాయుడు, లావరాజు, రాకేష్, సుమారు సతీస్ వినీత్ 200 మంది బోర్వెల్స్ సమ్మెలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments