Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshక్రీడా పోటీల్లో ఉషోదయ విద్యార్థుల ప్రతిభ

క్రీడా పోటీల్లో ఉషోదయ విద్యార్థుల ప్రతిభ

నర్సీపట్నం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయిలో మై భారత్ వారు నిర్వహించిన క్రీడ పోటీల్లో ఉషోదయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. దీనిలో భాగంగా బాలిక విభాగంలో కబడ్డీ ద్వితీయ స్థానాన్ని, బాలురు విభాగంలో వాలీబాల్ ప్రథమ స్థానాన్ని, వ్యక్తిగత అంశాల్లో షార్ట్ ఫుట్ సాయికి ప్రధమ, సురేంద్రకు ద్వితీయ స్థానాన్ని,రన్నింగ్ 200 మీటర్లు పందెంలో కృష్ణకు ప్రథమ స్థానం, శరత్ ద్వితీయ స్థానాన్ని కైవాసం చేసుకున్నారు. ఈ విజయం పట్ల ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జే. రమణాజీ, కరస్పాండెంట్ కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్యాంజి, డీన్ ఎస్ వి వాసు, ప్రిన్సిపల్ ఎస్ ఎన్ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ పి దొరబాబు విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉషోదయ డిగ్రీ కళాశాల చదువుతోపాటు క్రీడాంశాలను, ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వంటి సహపాఠ్య కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతో ముఖభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ విజయం పట్ల తోటి అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో అకడమిక్ ఇంచార్జి కె.హర్షవర్ధన్,పీడీ సిహెచ్ గణేష్, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments