నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ నందు మాదిగ-జేఏసీ కన్వీనర్ చదలవాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డివిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం చెట్టే రాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీతో కలిసి పోరాటం చేసి జైలుకెళ్లిన నాయకుడు బాబూజీ అని అన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్‌కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నేత చదలవాడ వెంకటేశ్వరరావు, బి ఎస్ పి నాయకులు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మారుగుడి సురేష్, డివీఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కోడి సుజ్ఞాన్ కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముసుకూడి రాము, జిల్లా ఇన్‌చార్జ్ మెరిపే రాజేష్, ఉప్పాటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
