Home News బిజేపి వర్క్ షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

బిజేపి వర్క్ షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

0

బూత్ స్థాయి నుండి కార్యకర్తలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతెలిపారు . ఈ మేరకు పాతకర్నావాని పాలెం శ్రీ కృష్ణ దేవరాయ కల్యాణ మండపం లో పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ 2026 వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు,బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ్ రాజు ముఖ్య అధితి గా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ లో ప్రతి కార్యకర్త నాయకులే అని కుటుంబాలకు అతీతంగా కింద స్థాయి నాయకులునే పార్టీ గుర్తించి వారికీ సముచిత స్థానం కల్పిస్తుంది అన్నారు. దేశంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీ బీజేపీ అన్నారు.800 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అని 11 వ స్థానం లో ఉన్న దేశ ఆర్ధిక రంగాన్ని 4 వ స్థానానికి తెచ్చిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ప్రత్యర్థి దేశాలు మనవైపు దాడి చేయడానికి వీలు లేకుండా రక్షణ రంగాన్ని బలోపేతం చేసారన్నారు.
ప్రజలకు భరోసా కల్పించడానికి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు అన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, సిరసపల్లి నూకరాజు,పిల్లై,గోలి శంకరరావు,సోమశేఖర్,వర్రి లలిత,సత్యనారాయణ,నాగేశ్వరరావు,రోహిణి,ఈశ్వరరావు,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version